శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (08:58 IST)

ఈ భార్యలు ఏడు సెకన్లు కూడా మాకొద్దు.. భార్యాబాధితుల సంఘం

victim husbands
ఇటీవలికాలంలో భర్తలపై వేధింపులు, హతమార్చే భార్యల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా, అక్రమ సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భర్తలను తమ ప్రియుళ్ళతో కలిసి కిరాతకంగా హత్య చేస్తున్నారు. తాజాగా కొందరు భార్యాబాధితులు భార్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. దేవుడా ఈ భార్యలు ఏడు జన్మలు కాదు కదా.. ఏడు సెకన్లు కూడా తమకు వద్దంటూ వారు పూజలు చేశారు.
 
సాధారణంగా వట సావిత్రి పౌర్ణమి రోజున మహిళలు ఏడు జన్మలకూ ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. కానీ, భార్యాబాధితుల సంఘం సభ్యులు మాత్రం వింత పూజలు చేశారు. ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు వద్దంటూ దేవుణ్ని అర్థించారు. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.