భర్తనని నమ్మించి వదినపై కవల సోదరుడి అత్యాచారం..
మహారాష్ట్రలోని లాతూరులో దారుణం జరిగింది. అన్న భార్యపై కవల సోదరుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తనని నమ్మించి నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. రూపు రేఖలు ఒకేలా ఉండటంతో తన భర్తేనని భ్రమపడిన బాధితురాలు ఈ తప్పు చేసింది. ఇది తెలిసిన భర్త.. భార్య తన సోదరుడుతో పెట్టుకున్న సంబంధాన్నే కొనసాగించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... లాతూర్‌లోని ఓ కుటుంబంలోని కవలలైన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వీరిద్దరూ పోలికల్లో అచ్చం ఒకేలా ఉంటారు. అయితే వీరిలో అన్నకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. సోదరులిద్దరూ కవలలు కావడం, ఆహార్యం, శరీర సౌష్టవం ఒకేలా ఉండడంతో వారిలో ఎవరు ఎవరో గుర్తించడం కష్టంగా ఉండేది.
దీన్ని సొమ్ము చేసుకున్న తమ్ముడు.. అన్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడడం మొదలుపెట్టాడు. అన్న లేని సమయంలో ఆమె గదిలోకి ప్రవేశించి భర్తలా ప్రవర్తించి లైంగిక వాంఛలు తీర్చుకోసాగాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే పోలికలతో ఉండడంతో ఆమె కూడా తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గుర్తించలేకపోయింది.
ఆరు నెలల తర్వాత ఆమెకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. అయితే, ఇక్కడే మరో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి భర్తకు చెప్పగా అతడు చెప్పింది విని ఆమె షాకైంది. ఆ సంబంధాన్ని అలాగే కొనసాగించాలంటూ అతడు చెప్పిన మాటలు ఆమెను నిర్ఘాంతపరిచాయి.
ఈ విషయం తెలిసిన అత్తింటి వారు కూడా అతడినే సమర్థించడంతో బాధితురాలు సహించలేకపోయింది. అన్నదమ్ములిద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి అరదండాలు వేశారు.