గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (09:54 IST)

నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిని అలా కొడతారా?

woman
మహిళల పట్ల అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బాగల్ కోట్‌లో దాడి చేసిన వ్యక్తిని మహంతేశ్  చొలచగడ్డ బాధితురాలిని సంగీత షిక్కేరిగా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఇద్దరి మధ్యా ఆస్తి తగాదాల వల్లే మహంతేశ్ దాడి చేశాడని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాగల్ కోట్‌లోని హార్టికల్చర్ సైన్సెస్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహంతేశ్‌ను అరెస్ట్ చేశారు. 
 
బీజేపీ బాగల్ కోట్ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్ తనను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని బాధితురాలు సంగీ తెలిపింది. 
 
ఆ ఘటనకు సంబంధించే తనపై దాడి చేయించారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.