శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మే 2022 (15:55 IST)

నడి రోడ్డుపై మహిళా న్యాయవాదిపై అమానుష దాడి

knife
ఆస్తి తగాదాల కారణంగా ఓ మహిళా న్యాయవాదిపై అమానుషం దాడి  జరిగింది. కర్నాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌‌లో ఈ దాడి శనివారం జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తిని మహంతేష్‌గా గుర్తించారు. అలాగే, కత్తిపోట్లకు గురైన మహిళా న్యాయవాదిని సంగీత షిక్కేరిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఆస్తి తగాదాల వల్లే మహంతేశ్ దాడి చేశాడని తెలుస్తోంది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాగల్‌కోట్‌లోని హార్టికల్చర్ సైన్సెస్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహంతేశ్‌ను అరెస్ట్ చేశారు. బీజేపీ బాగల్‌కోట్ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్ తనను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని బాధితురాలు సంగీత తెలిపింది. 
 
ఆ ఘటనకు సంబంధించే తనపై దాడి చేయించారని పేర్కొంది. అయితే, మహంతేశ్ మాత్రం ఆమె వ్యాఖ్యలను ఖండించాడు. తాను ఎవరో చెబితే దాడి చేయలేదని అన్నాడు. ఇటు బీజేపీ నేత రాజు నాయకర్ కూడా సంగీత ఆరోపణలను తోసి పుచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.