తెలుగు సినిమా డైలాగ్‌లపై జస్టిస్ ఎన్.వి. రమణ ఘాటు వ్యాఖ్యలు
Justice N.V. Ramana, K. Raghavendra Rao
ఒకప్పటి తెలుగు సినిమా స్వర్ణ యుగం అంటుంటారు. అచ్చమైన తెలుగు, హాస్యం, భాష ప్రాధాన్యత వుండేవి. కానీ రానురాను కాలంమారడంతో ఓవర్‌సీస్ మార్కెట్ పెరగడంతో సినిమా కథలు, డైలాగ్స్ కూడా విదేశీయులకు అనుగుణంగానే రాస్తున్నారు. చాలా తెలుగు సినిమాల్లో తెలుగు భాష, తెలుగు దనం కనిపించడంలేదంటూ సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు బాహుబలి, ఆర్.ఆర్.ఆర్.లతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన పరిశ్రమగా ఆయన కీర్తించాడు. కానీ నేడు అందరికీ చురకవేశారు.
జస్టిస్ రమణ అభిప్రాయం ప్రస్తుతం తెలుగు మీడియాలోనూ వుంది. ఈ విషయాన్ని దర్శకులు, నిర్మాతలు, హీరోలకు విన్నవించినా వారంతా సినిమా అనేది వ్యాపారం ఓవర్‌సీస్ వల్ల అలా చేయాల్సివస్తుందని చెప్పిన సందర్భాలూ వున్నాయి.
ఇక, జస్టిస్ రమణ తెలుగు భాషపై మాట్లాడడానికి కారణం. దర్శకుడు కె. రాఘవేంద్రరావు రాసిన `నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ` అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు సినిమా చూస్తూ సబ్‌టైటిల్స్ చదివి డైలాగ్స్ అర్థం చేసుకునే దయనీయ స్థితికి తెలుగు సినిమా వెళ్ళొద్దు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో శనివారంనాడు ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన వీడియో ద్వారా మాట్లాడారు. మరి రమణ మాటలకు సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.