1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (17:19 IST)

అమృత్‌సర్‌ గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

Fire
Fire
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించిన ఘటనను మరిచిపోకముందే అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 
 
స్థానిక గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.. ఓపీడీ సమీపంలో ఈరోజు పెద్ద పేలుడు సంభవించింది. అనంతరం సమీపంలోని భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 
 
అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎవరికీ గాయాలు కానీ కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.