బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (15:06 IST)

ఒకే ఆస్పత్రి.. ఒకేసారి 11 మంది సిబ్బంది గర్భం దాల్చారు..!

Nurse
Nurse
ఒకేసారి ఆస్పత్రిలో పనిచేసే 11 మంది సిబ్బంది ఒకేసారి గర్భం దాల్చడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోగల లిబర్టీ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒకేసారి గర్భం దాల్చిన 11 మంది ఒకే విభాగంలో పనిచేస్తున్నారు. 
 
వీరిలో పది మంది నర్సులు కాగా.. ఒకరు వైద్యురాలు. ఈ ఏడాదిలోనే ఈ 11 మంది బిడ్డలకు జన్మనివ్వనున్నారు. ఇలా ఒకేసారి ఇంత మంది గర్భం దాల్చడం తమ ఆస్పత్రిలో ఎప్పుడూ చూడలేదని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.
 
ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కొన్ని జోకులు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా.. పిల్లల డే కేర్ సెంటర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని అక్కడి వారు కామెంట్లు చేస్తున్నారు.