మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (20:37 IST)

బేబీ బంప్‌తో నమిత.. త్వరలో తల్లికాబోతున్నానని ప్రకటన (video)

Namita
Namita
గుజరాత్‌కు చెందిన అందాల తార నమిత తెలుగులో సొంతం, జెమిని, నాయకుడు, బిల్లా, సింహ చిత్రాల్లో నటించింది. తాజాగా తన ఫ్యాన్సుకు నమిత గుడ్ న్యూస్ చెప్పింది. 
 
2017లో తన ప్రియుడైన వీరేంద్రను పెళ్లి చేసుకుని సెటిలైన నమిత... పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా ఈ అమ్మడుకి ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు. 
 
ఈ నేపథ్యంలో తాను ప్రెగ్నెంట్ అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని.. తాను ఇన్నాళ్లు కోరుకున్నది ఇదేనని వెల్లడించింది. 
 
"నేను ఇన్నాళ్లు కోరుకున్నది నీ గురించే.. నీకోసమే ప్రార్థించా" అంటూ పుట్టబోయే బిడ్డ గురించి రాసుకు వచ్చింది నమిత. 41 సంవత్సరాలలో నమిత ప్రెగ్నెంట్ కావడం గమనార్హం.