ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (15:04 IST)

భాగ్యనగరిలో వరుస హత్యలు - బీరు బాటిల్స్‌తో పొడిచి హత్య

murder
భాగ్యనగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో వరుస హత్యలు జరగడం ఇపుడు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తీసుకున్న ఓ వ్యక్తిని బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. ఈ హత్య హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నంబరు 12లో అర్థరాత్రి జరిగింది. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. 
 
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతుడి వివరాలు తెలియాల్సివుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ హత్య మద్యం మత్తులో జరిగివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.