గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (13:55 IST)

చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల నాణెం

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో విషాదం జరిగింది. ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆ చిన్నారి మింగిన ఐదు రూపాయల నాణెం వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీసినప్పటికీ చిన్నారి ప్రాణాలను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. 
 
ఈ ప్రాంతంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిలో చిన్నకుమార్తె చైత్ర (4) అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఐదు రూపాయల నాణాన్ని మింగింది. అయితే, అది గొంతులోనే ఇరుక్కుని పోయింది. ఆ వెంటనే హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు చికిత్స చేసి చిన్నారికి గొంతులో చిక్కుకున్న రూ.5 నాణెను వెలికి తీశారు. కానీ, ఆ చిన్నారి శ్వాసపీల్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తుదిశ్వాస విడిచింది. నాణెం ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించివుండొచ్చని వైద్యులు చెబుతున్నారు.