సంబంధిత వార్తలు
- నిరుపేద కుమ్మరికి రూ.1.25 కోట్ల జీఎస్టీ నోటీస్
- భార్య - ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త
- స్కూలు పిల్లల్ని ఎక్కించేందుకు ఆటో డ్రైవర్ దిగాడు, పిల్లాడు యాక్సలరేటర్ తొక్కాడు, వామ్మో... వీడియో
- పురిటి నొప్పులు భరించలేక కత్తితో పొడుచుకున్న గర్భిణి
- ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...
ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు ఆరేళ్ల క్రితం అదృశ్యమై.. అస్థిపంజరంగా కనిపించాడు..
ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు ఆరేళ్ల క్రితం అదృశ్యమై.. అస్థిపంజరంగా కనిపించాడు. ఆరేళ్లుగా అతని అంతుచిక్కకుండా అతని కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. అదృశ్యమైన తమ బిడ్డ ఎక్కడో ప్రాణాలతో వుంటాడనుకున్న అతని తల్లిదండ్రులకు చివరికి గుండె పగిలే వార్త వచ్చింది. 2020లో ఇంటి పెరట్లో ఆడుకుంటూ మాయమైన ఏడేళ్ల ప్రిన్స్ అలియాస్ టిల్లూ, సొంత బంధువుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బాలుడి అస్థిపంజరాన్ని పోలీసులు వెలికితీశారు.
2020 ఆగస్టు 16న ప్రిన్స్ తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ఇటీవల ఈ కేసులో తిరిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగానే బాలుడిని బంధువులు గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌వే పక్కన గొయ్యి తీసి పూడ్చిపెట్టినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.
నిందితులు చూపిన ప్రదేశంలో తవ్వకాలు జరపగా, బాలుడి అస్థిపంజరం, కొన్ని బట్టలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.
