గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (23:19 IST)

హాస్పిటల్‌కు వెళ్లిన ప్రభాస్.. ఎందుకని?

prabhas
prabhas
డార్లింగ్ ప్రభాస్ హాస్పిటల్‌కు వెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ మాస్క్ పెట్టుకుని చాలా స్టైల్‌గా నడుచుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదని కొందరు అంటుంటే.. ఇది కొత్త వీడియో అంటూ మరికొందరు వాదిస్తున్నారు. 
 
మరోవైపు అభిమానుల్లో మాత్రం ప్రభాస్‌కు ఏమైందనే టెన్షన్ మొదలైంది. కృష్ణంరాజును హాస్పటిల్‌లో పెట్టి ఉంటారని.. అందుకే ఆయనను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లి వుంటారని చెప్తున్నారు. కానీ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని 
 
ప్రభాస్ అయితే కచ్చితంగా సర్జెరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతకాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ మధ్యనే సర్జెరీ కోసం విదేశాలకు వెళ్ళొచ్చాడు. కానీ సర్జరీ చేయించుకోలేదు. ఎందుకంటే సర్జరీ కోసం ప్రభాస్ బరువు తగ్గాలి అని వైద్యులు సూచించారు.
 
అందుకోసం ఆక్వా థెరపీ తీసుకుని సన్నబడ్డాడు. కండరాల నొప్పి‌తో బాధపడే వారు బరువు తగ్గడానికి ఇదే బెస్ట్ థెరపీ అని తెలుసుకుని ప్రభాస్ దీనిని ఫాలో అయ్యి బరువు తగ్గాడు. అంటే ప్రభాస్ సర్జరీ చేయించుకున్నట్టే అని కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.