గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (15:23 IST)

ప్రభాస్ సినిమాలో నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు.. కరీనా కపూర్

kareena
పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా వున్నారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ఇక ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమాతో బిజీగా ఉన్నారు.
 
ఇకపోతే ఈ సినిమా అనంతరం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాహో, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలలో బాలీవుడ్ నటిమనులు సందడి చేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.
 
ఈ సినిమా అనంతరం ఈయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాలో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా పెద్ద ఎత్తున ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి.  
 
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఆఫర్ వచ్చిందా అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నాకు ప్రభాస్ సినిమాలో ఏ విధమైనటువంటి ఆఫర్ లేదని, నేను స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాననీ వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈమె స్పిరిట్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.