కృష్ణంరాజుగారిలో ఓ రహస్యం దాగివుంది - మరణం గురించీ ముందుగానే చెప్పారు
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు చనిపోవడం బాధాకరమే. ఆయన నటుడిగానే ఆందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలీని మరో కోణం ఆయనలో దాగివుంది. నటుడికాకముందే ఆయన వైద్యుడు కూడా. కీర్తిశేషులు అల్లు రామలింగయ్యగారు హోమియో వైద్యంతో సినీరంగంలో ఎంతో మందికి క్యూరిఫై చేసేవారు. ఆ తరహాలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు తను నేర్చుకున్న ఆకు వైద్యంతో ఎంతోమంది కామెర్లతో బాదపడుతుంటే ఆకు పసర పోసి క్యూరిఫై చేసిన వ్యక్తి ఆయన. సినిమారంగంలో ఆరంభం నుంచి ఈ వైద్యం ఆయన చేస్తుండేవాడు. చాలామంది కార్మికులకు, వారి పిల్లలకు, తన ఊరిలోని ప్రజలకు ఆయన ఎంతో సేవ చేశారు.
అందుకే ఓ సందర్భంలో ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు చాలా వ్యక్తిగత విషయాలు వచ్చాయి. మరణంపై కూడా టాపిక్ రావడంతో ఆయన చెప్పిన విధానం ఆశ్చర్యం కలిగింది. తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో 16 ఏళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయన ఏం చెప్పారంటే.. పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నేను తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈరోజూ.. అదే నా కోరిక అంటూ కృష్ణంరాజు గారు ఎంతో ఫీల్‌తో అప్పుడు ఆయన చెప్పారు. ఒక వైద్యుడిగా తన ఆరోగ్యం తన వ్యక్తిగతం కలబోసి చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.