సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (13:50 IST)

మాస్ మహారాజాతో అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran look
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కి 'కార్తికేయ 2' భారీ హిట్‌ను అందించింది. ఆమె కెరీర్‌లో 100 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. 
 
ఆ తరువాత సినిమాలుగా ఆమె నుంచి రావడానికి 18 పేజెస్, బట్టర్ ఫ్లై రెడీ అవుతున్నాయి. తాజాగా రవితేజ సినిమాకి అనుపమ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. 
 
'కార్తికేయ 2' సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.