మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:37 IST)

ఓటీటీకీ సిద్ధమవుతున్న నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ-2"

karthikeya-2
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం "కార్తికేయ-2". ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఆగస్టు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఇది తెలుగు, తమిళం కంటే హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టింది. 
 
సరైన బాలీవుడ్ చిత్రాలు లేకపోవడంతో తెలుగులో నిర్మితమై డబ్బింగ్ మూవీగా విడుదలైన "కార్తికేయ-2" సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో ఆడుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్. 
 
ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లను వసూలు చేయగా, ఇందులో రూ.60 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే, ఈ చిత్రం విడుదలై నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన జీ5 ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.