శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2022 (19:36 IST)

కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర.. రాహుల్‌తో కలిసి అడుగులేసిన పూనమ్ కౌర్!

Poonam Kaur_Rahul Gandhi
Poonam Kaur_Rahul Gandhi
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలో ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర శనివారం మహబూబ్‌ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ రోజు యాత్రలో భాగంగా రాహుల్ వెంట కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యాత్రకు సినిమా హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 
 
రాహుల్ గాంధీ పాదయాత్రలో శనివారం ఉదయం సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట నడుస్తూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 
 
అనంతరం పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్‌తో చర్చించానని, రాహుల్ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని పూనమ్ కౌర్ వెల్లడించారు. 
 
అంతేకాక చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీని కోరినట్లు పూనమ్ కౌర్ తెలిపింది. అయితే సినిమాలకు ప్రస్తుతం దూరంగా వుంటున్న పూనమ్ కౌర్.. వున్నట్టుండి రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రత్యక్షం కావటం చర్చనీయాంశంగా మారింది.