శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న రాహుల్ గాంధీ

rahul gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా, గురువారం ఉదయం 6.30 గంటలకు ఆయన తన యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ యాత్రకు రాహుల్ విరామం ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఆయన తన పాదయాత్రను నిలిపివేసిన చోటు నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. గురువారం ఉదయం 6.30 గంటలకు పెద్ద చెరువు, దండు గ్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. 
 
ఈ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగగా, దీనికి విశేష స్పందన లభించిన విషయం తెల్సిందే. కాగా, దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. తెలంగాణాలో యాత్ర పూర్తయితే రాహుల్ గాంధీ ఇప్పటివరకు 1500 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు.