సిద్ధరామయ్యను పరుగులు పెట్టించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు భారత్ జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేయి పట్టుకుని ఆయనతో కలిసి పరిగెత్తేలా చేసారు. దీనితో ఆయనతోపాటు మిగిలినవారు కూడా పరుగులు పెట్టడం ప్రారంభించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు వచ్చి వారి పరుగును ఆపే వరకు సిద్ధరామయ్య పరుగెత్తారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 30న కర్నాటకలో అడుగుపెట్టింది. అక్టోబర్ 21 వరకు రాష్ట్రం ద్వారా సాగి ఏపీలోకి అడుగుపెడుతుంది.