1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 నవంబరు 2022 (21:28 IST)

వింటర్ ఫుడ్, ఏమేమి తినాలో తెలుసా?

sweet potato
శీతాకాలంలో చిలకడ దుంపలు లభిస్తాయి. శీతాకాలం రాగానే మనం తినే ఆహారంలో కూడా కొద్ది మార్పులు చేసుకోవాలి. ఈ కాలంలో ఏమి తినాలో తెలుసుకుందాము.
 
చిలకడ దుంపలు, ఇవి మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
 
క్యారెట్ హల్వా, క్యారెట్ ఉడికించి హల్వా రూపంలో తీసుకోవడం వల్ల బీటాకెరోటిన్ శరీరానికి నేరుగా అందుతుంది.
 
శొంఠి లడ్డూలు, ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
 
మొక్కజొన్న రోటీ, ఈ రోటీని తినడం వల్ల మొక్కజొన్నలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
కిచిడీ, ఇది తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
 
పాలు- జిలేబీ, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది తగ్గుతుంది.
 
వేరుశెనగ, వేరుశనగ పప్పులు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
 
నువ్వులు బెల్లం బిస్కెట్లు, నువ్వులను బెల్లంతో తింటే ఎముకలకు, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.