సోమవారం, 7 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2022 (18:22 IST)

పొన్నగంటికూర అద్భుత ప్రయోజనాలు

ponnagantikura
ఆకుకూరలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అందులో పొన్నగంటికూరది ప్రత్యేక స్థానం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము.

 
పొన్నగంటి కూర కంటి చూపును మెరుగుపరుస్తుంది.
 
ఈ కూర పురుషులలో వీర్య వృద్ధికి, లైంగిక సమస్యలను నివారిస్తుంది. 
 
పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను సరిచేస్తుంది.
 
టేబుల్‌ స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా తగ్గుతాయి.
 
నరాల్లో నొప్పికి, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
మధుమేహంతో బాధపడేవారికి పొన్నగంటి కూర మేలు చేస్తుంది.
 
మొలల వ్యాధిని కూడా ఇది నివారిస్తుందని నిపుణులు చెపుతారు.