శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (11:42 IST)

'హిట్-2' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

hit-2 first single promo
అడవి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం "హిట్-2". నేచరుల్ స్టార్ నాని సమర్పణలో బోస్టర్ సినిమా బ్యానరుపై ప్రశాంత్రి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని "ఉరికే ఉరికే" అనే ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 10వ తేదీన ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. 
 
సిద్ శ్రీరామ్, రమ్య బెహ్రా ఆలపించిన ఈ పాటకు ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చగా, కృష్ణకాంత్ సంగీతాన్ని సమకూర్చారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అడవి శేష్.. కేడీ అనే పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రం గతంలో వచ్చిన "హిట్ ది ఫస్ట్ కేస్" చిత్రానికి సీక్వెల్‌గా వస్తుంది. ఎస్.మణికంఠన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల రెండో తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.