సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (11:02 IST)

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం : నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూత

Lohithaswa
Lohithaswa
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 80 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణంపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
కాగా, ఈయన 500కు పైగా చిత్రాల్లో నటించారు. పలు బుల్లితెర సీరియల్స్‌లో కూడా నటించారు. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 
 
ఏపీ 47, దాదా, దేవా వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఈయన తెలుగు చిత్రం అఖండలో ఎన్ఐఏ అధికారిగా నటించారు. వీటితో పాటు సాహో, అరవింద సమేత, జై లవకుశ  వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.