శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:56 IST)

బాలీవుడ్‌లో విషాదం - "త్రీ ఇడియట్స్" నటుడు కన్నుమూత

arun bali
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ వచ్చిన "త్రీ ఇడియట్" చిత్ర  నటుడు అరుణ్ బాలీ ఇకలేరు. ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 79 యేళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో గురువారం కన్నుమూశారు. 
 
గత కొంతకాలంగా నాడీ కండరాల వ్యాధి మస్తీనియా గ్రావిస్‌తో ఆయన బాధపడుతూ వచ్చారు. దీనికి చికిత్స కోసం ముంబైలోని హిర్షందాన్ని ఆస్పత్రిలో కూడా చేరారు. కానీ, ఆయన గురువారం చనిపోయారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. వీరు శుక్రవారం ముంబైకు చేరుకోనున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు. 
 
ఇదిలావుంటే అరుణ్ బాలీ అనేక చిత్రాల్లో నటించారు. త్రీ ఇడియట్స్, కేదార్‌నాథ్, పాలిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్ వాలా, గుండా, రామ్ జానే వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే, పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. అరుణ్ బాలీ నిర్మాతగా కూడా పలు చిత్రాల్లో నిర్మించి, ఒక నిర్మాతగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.