శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (14:10 IST)

శతాధిక వృద్ధుడు - నెహ్రూ కారు డ్రైవర్ కన్నుమూత

monappa gowda
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కారు డ్రైవరుగా పని చేసిన మోనప్ప గౌడ కన్నుమూశారు. ఈయన వయస్సు 102 సంవత్సరాలు. స్వాతంత్ర్యం సంగ్రామంలోనూ పాల్గొన్న మోనప్ప డ్రైవింగ్ స్కిల్స్‌కు మగ్ధుడైన నెహ్రూ తన కారు డ్రైవరుగా నియమించుకున్నారు. అలాంటి మోనప్ప 102 యేళ్ళ వయసులో గురువారం కన్నుమూశారు. 
 
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన కర్నాటకలోని కనకమాజుల గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు వెంకటరమణ, ముగ్గురు కుమార్తెలు కమల విమల, కుసుమ ఉన్నారు. 
 
స్వాతంత్ర్య సమరంలో నెహ్రూకు సాయం చేసిన ఆయన ఆ తర్వాత నెహ్రూ కారు డ్రైవరుగా పని చేశారు. అలాగే, నవరా రచయిత శివరామ్ కరంత్‌, మాజీ ఎంపీ శ్రీనివాస్ మాల్యా, మాజీ ముఖ్యమంత్రి కెంగల్ హనుమంతయ్యల వద్ద కూడా ఆయన కారు డ్రైవరుగా పని చేశారు. 
 
తాజ్ హోటల్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నపుడు మంగుళూరు విమానాశ్రయం నుంచి నెహ్రూను కారులో ఎక్కించుకుని వచ్చారు. ఆ సమయంలో మోనప్ప డ్రైవింగ్ నైపుణ్యానికి మగ్ధుడైన నెహ్రూ ఆయనను తన కారు డ్రైవరుగా నియమించుకున్నారు.