గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (13:39 IST)

చిత్ర పరిశ్రమలో విషాదం.. కేన్సర్‌తో బాల నటుడు కన్నమూత

rahul koli
చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాల నటుడు ఒకరు మృతి చెందాడు. ఈ బాల నటుడు నటించిన చిత్రం 'ఆస్కార్‌'కు నామినేట్ అయింది. గుజరాతీకి చెందిన "ది ఛెల్లో షో" ఎంపికైంది. కొందరు పిల్లల చుట్టూత ఈ చిత్ర కథ తిరుగుతుంది. ఆ బృందంలో ఒక్కడిగా రాహుల్ కోలీ అనే వ్యక్తి నటించాడు. ఈ బాల నటుడే ఈ నెల 2వ తేదీన కేన్సర్‌తో మరణించాడు. ఆ విషయాన్ని ఆ పిల్లవాడి తండ్రిగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై మృుతిడి తండ్రి మాట్లాడుతూ, 'అక్టోబర్ 2న ఉదయమే టిఫిన్ చేశాడు. అనంతరం కొన్ని గంటల పాటు జ్వరం వచ్చి తగ్గుతూ ఉండేది. ఆ సమయంలో రాహుల్ మూడుసార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత చనిపోయాడు. నా బిడ్డ ఇక లేడు. మా కుటుంబం బాధలో కురుకుపోయింది. కానీ మేము అతనికి చివరి సారిగా శుద్ధి కర్మలు చేసి.. అనంతరం అక్టోబర్ 14న విడుదలయ్యే అతని చివరి సినిమా ఛెల్లో షో చూస్తాం' అని బాధగా చెప్పుకొచ్చాడు. 
 
కాగా.. కోలి ఈ సినిమాలో రైల్వే సిగ్నల్‌మ్యాన్ కుమారుడు, చిత్ర ప్రధాన పాత్రధారి సమయ్ (భవిన్ రాబారి) క్లోజ్ ఫ్రెండ్‌గా నటించాడు. చనిపోయేటప్పటికీ కోలీ వయస్సు 15 ఏళ్లు మాత్రమే. అయితే.. కొన్నేళ్లుగా కోలీ లుకేమియా (క్యాన్సర్)తో బాధ పడుతున్నాడు. ఈ తరుణంలోనే 'ఛెల్లో షో' మూవీలో నటించి, తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.