శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (20:34 IST)

ద్వారకా శారదా పీఠం స్వరూపానంద స్వామి శివైక్యం

swaroopananda shankaracharya
గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ శివైక్యం చెందారు. ఆలయ వయస్సు 99 యేళ్లు. గత కొంతతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. మధ్యప్రదేశ్‌ నర్సింగాపుర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. 
 
స్వామి స్వరూపానంద సరస్వతీ 1924లో మధ్యప్రదేశ్‌లోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటిని వదిలి మతప్రచార యాత్రలు చేపట్టారు. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారు. 
 
ఈయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‍, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. 
 
స్వరూపానంద శివైక్యం.. సాధు సమాజానికి తీరని లోటని యోగీ ఆదిత్యనాథ్‌ ట్వీట్‌ చేశారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాలకు స్వామి చేసిన సేవలు యావత్ ప్రపంచం చిరకాలం గుర్తుంచుకుంటుందని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి.