శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (08:25 IST)

హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత

mahesh babu mother
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె హైదరాబాద్ నగరంలోని నివాసంలోనే బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెల్సిన అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ట్వీట్స్ చేస్తున్నారు. 
 
కాగా, హీరో కృష్ణకు ఇద్దరు భార్యలు కాగా, వారిలో ఒకరు ఇందిరాదేవి. మరొకరు విజయనిర్మల. ఈమె గతంలో చనిపోగా, ఇపుడు ఇందిరాదేవి కన్నుమూశారు. కృష్ణా - ఇందిరాదేవిలకు రమేష్ బాబు, మహేష్ బాబులతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.
mahesh babu mother
 
వీరిలో రమేష్ బాబు అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన విషయం తెల్సిదే. ఇపుడు ఇందిరాదేవి చనిపోవడంతో కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, కృష్ణ - విజయనిర్మల దంపతుల కుమారుడే హీరో నరేష్ కావడం గమనార్హం.