బిహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ... లాలూతో భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు బిహార్‌లో పర్యటించిన సందర్భంగా బుధవారం ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో బిజీబిజీగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ పాట్నా చేరుకున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లతో ఆయన సమావేశమయ్యారు. గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను కూడా ఆయన అందజేశారు. అనంతరం నితీష్, తేజస్విలతో జాతీయ రాజకీయాలపై చర్చించారు.
ఈ భేటీ అనంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ గత కొన్నేళ్లుగా జైలు జీవితం అనుభవించి ఇటీవలే కోర్టు బెయిల్‌పై విడుదలైవున్నారు.
ఆ తర్వాతు లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాలూ ఆరోగ్యం గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని, తద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.