శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (14:16 IST)

హీరో నాని నిర్మించిన 'హిట్-2' - డిసెంబరు 2న రిలీజ్

hit teaser out
హీరో నాని ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన నిర్మించిన "హిట్" చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. డిసెంబరు 2వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరి నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడవి శేష్ నటించారు. జాన్ స్టీవర్ట్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. 
 
శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేరారు. ఈ టీజర్‌ను చూస్తో పోలీస్ ఆఫీసర్‌గా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌లో అడవి శేష్ కనిపించారు. ఎవరు ఎంతగా కంగారు పడుతున్నా కూల్‌గా తాను చేయదలచుకున్న పనిని పూర్తి చేసే పనిలో అడవి శేష్ కొత్తగా కనిపిస్తున్నారు. 
 
ఒక యువతి మర్డర్ కేసును పోలీస్ ఆఫీసర్‌గా అడవి శేష్ ఎలా ఛేదించారన్నదే ఈ చిత్ర కథ. సరిగ్గా ఆ పాయింటుతోనే టీజర్‌ను కట్ చేశారు. రావు రమేష్ ఓ కీలక పాత్రను పోషించారు. డిసెంబరు 2వ తేదీన భారీ స్థాయిలో థియేటర్‌లో విడుదల చేయనున్నారు.