1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (13:49 IST)

ఐదు భాషల్లో అడవి శేష్ "గూఢచారి" సీక్వెల్

Adavi Shesh
తెలుగు యువ నటుడు అడవి శేష్ వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇటీవల "మేజర్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్మీ అధికారి మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించి ప్రేక్షకుల మనస్సులనే కాకుండా మంచి లాభాలను కూడా అర్జించారు. ఇపుడు మరో చిత్రంపై కన్నేకశారు. "గూఢచారి" సీక్వెల్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెన్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
గత 2018లో వచ్చిన "గూఢచారి" విశేష ఆదరణ పొందడమేకాకుండా లాభాలను కూడా తెచ్చిపెట్టింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే టైటిల్‌తో ఫ్రాంచైజీ చేయాలన్న ఉద్దేశ్యంతో అడవి శేష్ ఉన్నారట. మొత్తం "క్షణం", "గూఢచారి", "మేజర్" వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.