శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (12:06 IST)

"హిట్-2" రిలీజ్ డేట్‌తో క్లారిటీ - నెల రోజుల వ్యవధిలో 2 చిత్రాలు

hit-2 movie
అడవి శేష్ హీరోగా నటించిన "హిట్-2" చిత్రం విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. జూన్ 29వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అడవి శేష్ "మేజర్" మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. శశికరణ్ తిక్క తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలోనే ఆయన నటించిన మరో చిత్రం "హిట్-2" చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. 
 
"హిట్-2"లో అడవి శేష్ ప్రధాన పాత్రలో "కేడీ" అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. "మేజర్" చిత్రం విడుదలైన నెల రోజులు తిరగకముందే హిట్-2 చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేయడం గమనార్హం. ఈ విడుదల తేదీతో పాటు ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 
 
ఈ "హిట్-2" చిత్రానికి గతంలో అడవిశేష్ నటించిన తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. కథానాయకుడు నాని సమర్పకుడు. అడవి శేష్ జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పోస్టర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.