సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (16:41 IST)

సింగర్ సునీత గ్రేట్.. కుమార్తెను నాసాలో శాస్త్రవేత్త చేయాలని?

singer suneeta2
సింగర్ సునీత కుమార్తెను శాస్త్రవేత్త చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. నాసాలో శాస్త్రవేత్త చేయాలని అందుకు భారీగా ఖర్చు పెడుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దాదాపు సునీత ఇప్పటివరకు సంపాదించిన ఆస్తి మొత్తం తన కూతుర్ని శాస్త్రవేత్త చేయడానికి ఖర్చుపెడుతోందని టాక్ వస్తోంది. 
 
తన కుమార్తె కోసం ఏ తల్లి చేయనంత సాహసం సునీత చేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం. అందుకు తగ్గట్టుగానే సునీత కూతురు శ్రేయ కూడా పట్టుదలతో శాస్త్రవేత్త అవ్వాలని బాగా చదువుతున్నట్లు తెలుస్తోంది. 
 
సునీత అనుకున్నట్టుగానే తన కూతుర్ని సైంటిస్ట్ చేయగలిగితే ఆమె తన కష్టాలలో విజయం సాధించినట్టే అవుతుంది. మరి ఇదంతా జరగాలంటే మరికొన్ని సంవత్సరాలు ఎదురు చూడక తప్పదు.