శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (22:39 IST)

రుహానీ దీదీగా హనీ ప్రీత్‌కు పేరు మార్చిన డేరా బాబా..

డేరా సచ్చా సౌదా నేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఇటీవలే కోర్టు ఆయనకు 40 రోజుల పెరోల్‌లో బయటికి వచ్చాడు. తాజాగా తన సన్నిహితురాలు హనీ ప్రీత్ ఇన్సాన్‌ను ఇప్పటికే దత్తపుత్రికగా ప్రకటించిన డేరా బాబా, తాజాగా ఆమెకు కొత్త పేరు పెట్టారు. 
 
ఇకపై ఆమె 'రుహానీ దీదీ'గా పిలువబడుతోందని చెప్పారు. అమ్మాయి హనీప్రీత్‌ను ఇక ఎలాంటి గందరగోళం లేకుండా రుహానీ దీదీగా పిలువవచ్చునని డేరా బాబా ప్రకటించారు. ఇప్పటితరం వాళ్లకు అనువుగా ఉండేలా 'రుహీ దా' అని కూడా పిలుచుకోవచ్చునని వివరించారు.