మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (10:44 IST)

మహిళను మింగేసిన కొండ చిలువ.. ఎక్కడ?

python eating woman
ఇండోనేషియాలో ఓ విషాదకరఘటన జరిగింది. 54 యేళ్ల మహిళను 24 అడుగులు పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. అటవీ ప్రాంతంలోని రబ్బరు ఏరేందుకు వెళ్లిన ఆ మహిళ అనూహ్యంగా కొండచిలువ చేతిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి ఓ 54 యేళ్ల మహిళ రబ్బరు ఏరేందుకు వెళ్లింది. ఆమె రెండు రోజులైన తిరిగి రాకపోవడంతో అనుమానించిన భర్త.. ఆమెను వెతుక్కుంటూ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆమె చెప్పులు. జాకెట్, హెడ్‌స్కార్ఫ్, కత్తి వంటివి కనిపించాయి. దీంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు అడవిని జల్లెడపట్టగా ఓ కొండ చిలువ కనిపించింది. దాని పొట్ట ఉబ్బెత్తుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఆ మహిళను కొండచిలువ మింగేసి ఉంటుందని భావించారు. ఆ తర్వాత గ్రామస్థులతో కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. అందులో మహిళ కళేభరాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.