ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (09:59 IST)

దేశంలో దిగిరానున్న వంటనూనెల ధరలు.. ఎలా?

Oils
గత కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల దెబ్బకు అన్ని వర్గాల ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. అయితే, త్వరలోనే ఈ ధరలు కిందికి దిగిరానున్నాయి. పామాయిల్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఇండోనేషియా ఎత్తివేసింది. ఈ నెల 23వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడొడొ తెలిపారు. పామాయిలి ఎగుమతలు మళ్లీ జోరందుకుంటే వంట నూనెల ధరలు కూడా క్రమంగా దిగివచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవున్న పామాయిల్‌లో ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచే 85 శాతం ఉత్పత్తి అవుతుంది. అయితే, తమ దేశంలో పెరిగిపోతున్న నూనె కొరతను నివారించడంతో పాటు ధరలకు కళ్లెం వేసేందుకు వీలుగా ఇండోనిషియా ప్రభుత్వం పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ఆ దేశం నుంచి పామాయిల్‌ను అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌లో నూనెల ధరలు పెరిగిపోవడంతో వీటి ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుకున్న విషయం తెల్సిందే.