సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (14:03 IST)

పెళ్లి కాకుండా పిల్లలను కంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు..

jaya bachchan
బాలీవుడ్ బిగ్ బి, అమితాబచ్చన్ సతీమణి జయా బచ్చన్ తన మనవరాలు నవ్య నవ్వేలి పెళ్లి కాకుండా పిల్లలను కంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. ఒక రిలేషన్ షిప్‌లో శారీరక ఆకర్షణ.. శారీరక సంబంధం తప్పనిసరి అన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో జయాబచ్చన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసింది. 
 
"ఇలా మాట్లాడితే ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారు. కానీ శారీరక ఆకర్షణ.. అనుకూలత చాలా ముఖ్యమైనవి. మా కాలంలో మేము ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. కానీ నేటి తరం అలా కాదు. అన్ని సాహాసాలు చేస్తుంది. ఎందుకు చేయకూడదు ? అంటే.. వారు దీర్ఘకాలిక సంబంధానికి కూడా బాధ్యత వహిస్తారు. అలాంటి వ్యక్తులు శారీరక సంబంధంలో లేకుంటే వారు సంబంధం ఎక్కువ రోజులు కొనసాగదు. వారు ప్రేమ, స్వచ్చమైన గాలి.. అనుకూలతతో ఎక్కువ రోజులు జీవించలేరు. ఇవే ఓ అందమైన రిలేషన్ షిప్ కు ముఖ్యమైనవి అని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
 
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా జనాలు కొందరు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దవారై ఉండి యువతకు ఇలాంటి సందేశాలు ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.