మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (13:02 IST)

బిగ్ బాస్ కొత్త ప్లాన్.. టీఆర్పీ రేటింగ్ తగ్గింది.. నో నామినేషన్స్

Bigg Boss Telugu 6
బిగ్ బాస్ కొత్త ప్లాన్ చేశారు. టీఆర్పీ తగ్గడంతో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే ప్రతివారం ఆదివారం జరగాల్సిన ఎలిమినేషన్ శనివారం చేసేశారు. శనివారం హౌజ్ నుంచి ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇనయా చాలా బాధపడింది. ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు.
 
ఆదివారం వీకెండ్ ఎపిసోడ్‌ని నాగార్జున ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో గ్రాండ్‌గా మొదలుపెట్టాడు. శనివారం ఎలిమినేట్ అయిన ఆర్జే సూర్యని స్టేజి మీదకి పిలిచాడు నాగార్జున. కంటెస్టెంట్స్‌లో ఫ్లవర్స్‌ అనిపించేవాళ్ళు, ఫైర్‌ బ్రాండ్స్‌ అనిపించేవాళ్ళు చెప్పమన్నాడు. రేవంత్‌, గీతూ, శ్రీహాన్‌, బాలాదిత్యలని ఫ్లవర్స్ అని, ఫైమా, ఇనయ, రాజ్‌, కీర్తిలను ఫైర్ అని చెప్పాడు సూర్య.
 
ఇక ఇనయాతో కాసేపు లవ్ ట్రాక్ నడిచింది. ఇద్దరూ అర్ధం కానీ సైన్ లాంగ్వేజ్‌తో మాట్లాడుకున్నారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక నాగార్జున అలా చూస్తూ ఉండిపోయాడు. ఇనయాతో మాట్లాడుతూ మొదట్లో ఇనయాతో ఎక్కువ గొడవలయ్యేవని, పదేపదే తిట్టుకునేవాళ్లమని, ఇప్పుడు వెళ్లిపోతున్నా కాబట్టి నా గేమ్‌ కూడా నువ్వే ఆడి టాప్‌ 5లో ఉండాలని చెప్పాడు.
 
ఇక ఆర్జే సూర్య వెళ్ళాక లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌ హీరోహీరోయిన్లు సంతోశ్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా స్టేజీపైకి వచ్చారు. ఫరియా నాగార్జునతో కలిసి డ్యాన్సులు వేశారు. ఆ తర్వాత ఇంటిసభ్యులతో ముచ్చటించారు. 
 
ఇక చివర్లో మళ్ళీ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. ఈ నామినేషన్ ప్రాసెస్‌లో చివరికి ఆదిరెడ్డి, మెరీనా మిగిలారు. అంతా ఆదిరెడ్డి వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ నాగార్జున చివర్లో ట్విస్ట్ ఇచ్చి ఈ వారం ఎలిమినేషన్ లేదనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌లో మళ్ళీ నామినేషన్స్ ఉండనున్నాయి.