గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:59 IST)

అప్పగింతల వరకు ఆగకపోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్టే.. ఎవరు? (video)

Nagarjuna
Nagarjuna
బుల్లితెరపై అందరి దృష్టిని ఆకర్షించే ప్రోగ్రామ్‌లలో బాస్ ఒకటి. బిగ్ బాస్ లవర్స్ తదుపరి సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ మేకర్స్ సీజన్ 6కి సంబంధించిన సరికొత్త ప్రోమోను విడుదల చేశారు. తెలుగు బిగ్ బాస్‌ షోకు టాలీవుడ్ యాక్టర్ కింగ్ నాగార్జున యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో ప్రారంభం కానుందని, మరిన్ని అప్‌డేట్‌ల కోసం స్టార్ మాతో కలిసి ఉండాలని నాగ్ కోరారు. ఈ వీడియోలో అప్పగింతలు జరుగుతున్న వేళ తల్లిదండ్రులు కుమార్తె కోసం ఏడుస్తుంటే.. వున్నట్టుండి ఫోనుకు వచ్చిన సందేశంతో పెళ్లికూతుర్ని వదిలి అందరూ మాయమవుతారు. 
 
ఆ సమయంలో నాగ్ ఎంట్రీ ఇస్తారు.. "డియర్ అంటూ.. అప్పగింతల వరకు ఆగకపోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్టే.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి అటా ఫిక్స్.." అంటూ నాగ్ చెప్పిన డైలాగ్‌కు బాగా రెస్పాన్స్ వస్తోంది. బిగ్ బాస్ షోకి స్మాల్ స్క్రీన్ లవర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.