శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2022 (22:16 IST)

బాలీవుడ్‌ను ప్రమోషన్లతో షేక్ చేస్తున్న లైగర్ ప్రమోషన్స్, విజయ్ దేవరకొండ కోసం ఫ్యాన్స్ రచ్చరచ్చ

Actors Vijay Deverakonda and Ananya Pandey
Photo: Girish Srivastav
విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంటగా పూరీ జగన్నాథ్ తరకెక్కించిన చిత్రం లైగర్. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. దీనితో చిత్రం ప్రమోషన్లను చిత్ర యూనిట్ చురుగ్గా చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాడు ముంబైలో ఓ షాపింగ్ మాల్‌లో లైగర్ ప్రమోషన్ ఈవెంట్ ప్లాన్ చేసారు.

 
Actors Vijay Deverakonda and Ananya Pandey
ఈ ఈవెంటుకి భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. ఉయ్ లవ్ విజయ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని స్టేజీ వద్దకు దూసుకు వచ్చేందుకు పోటీపడ్డారు. లేడీ ఫ్యాన్స్ అయితే విజయ్ దేవరకొండను చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

 
Actors Vijay Deverakonda and Ananya Pandey
ఓ దక్షిణాది హీరోకి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ ఈవెంట్ హోస్ట్ చేస్తున్న యాంకర్ నితిన్ జక్కర్ సైతం విజయ్ దేవరకొండకు వస్తున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తను ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ చిత్రాల ప్రమోషన్లుకు యాంకరింగ్ చేసాననీ, కానీ ఈ స్థాయి స్పందన ఇంతవరకూ చూడలేదంటూ దానికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసాడు.

 
Actors Vijay Deverakonda and Ananya Pandey
కాగా ఈవెంటుకి భారీగా ఫ్యాన్స్ రావడంతో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇద్దరూ మధ్యలోనే స్టేజి దిగేసి వెళ్లిపోవాల్సి వచ్చింది.