ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (12:59 IST)

కాంతారా హిట్.. ముంబైలో ప్రైవేట్ జెట్‌లో రిషబ్..

Kanthara
Kanthara
రిషబ్ కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 28 శుక్రవారం నాటికి కాంతారావు హిందీలో టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 31.70 కోట్లు సాధించింది. ఇటు తెలుగులో కూడా అదిరిపోయే కలెక్షన్లతో రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది. 
 
కాంతార సినిమాను అక్టోబర్ 15న తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో రిషబ్ అంట్ టీమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ప్రమోషన్ల కోసం ఈ టీమ్ పలు చోట్ల పర్యటిస్తోంది. 
Kanthara
Kanthara
 
తాజాగా నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఆదివారం ఉదయం ముంబైలో కనిపించారు. నగరంలోని సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రిషబ్ ప్రైవేట్ జెట్‌లో ఫోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.