బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:27 IST)

"కాంతార" చిత్ర బృందానికి లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

kantara
కన్నడ నటుడు రిషబ్ షెట్టి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన చిత్రం "కాంతార". ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఒక్క కన్నడంలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అయితే, ఈ చిత్ర బృందం ఇపుడు చిక్కుల్లో పడింది. 
 
ఈ సినిమాలో ఉపయోగించిన సంగీతం తమదేనంటూ కేరళకు చెందిన ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కన్నడంలో "తైక్కుడం బ్రిడ్జ్" అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. ఈ కంపెనీ పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌కు కూడా తయారు చేశారు. ఈ ఆల్బమ్స్‌లోని సంగీతాన్ని "కాంతార" చిత్రానికి ఉపయోగించినట్టు పేర్కొంటూ చిత్ర బృందానికి ఆ మ్యూజిక్ బ్యాండ్ కంపెనీ నోటీసులు జారీచేసింది. 
 
ఇదే అంశంపై ఆ మ్యూజిక్ కంపెనీ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. "మా ఆడియన్స్‌కి మేము ఒకటే చెప్తున్నాం. "కాంతార" సినిమాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, మా సాంగ్ 'నవరసం'.. 'కాంతార'లోని "వరాహ రూపం" సాంగ్‌లో ఉన్న మ్యాజిక్‌కు చాలా వరకు ఒక్కటే. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కాపీ కొట్టడం, ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. ఆ మ్యూజిక్ పూర్తిగా మా సొంతం. అందుకే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసీలు పంపుతున్నాం" అని పేర్కొంది.