ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (12:22 IST)

ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్ ఊరమాస్ లుక్ - "వాల్తేరు వీరయ్య" ఫస్ట్ లుక్

waltair veeraiah
మెగాస్టార్ చిరంజీవి మాంచి జోరుమీదున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల "గాడ్ ఫాదర్" రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఇపుడు "వాల్తేరు వీరయ్య"గా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇది చిరంజీవి నటించే 154వ చిత్రం. 
 
వీరయ్య తనని సవాల్ చేసిన వారికి తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పేందుకు ఒక యాక్షన్ సీన్‌పై ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. "రంగు బనీనుపై పూల చొక్కా, పైకి ఎగ్గట్టిన లుంగీ, చెవికి రింగులు, మెళ్లో బంగారు గొలుసులు, ఒక చేతికి బంగారం కడియం, మరో చేతికి గోల్డ్ వాచ్ బ్లాక్‌ స్పెట్స్‌తో కనిపిస్తూ బీడీ దమ్ముకొడుతూ" చిరంజీవి ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. 
 
ఈ సినిమాలో వీరయ్యకు యూట్యూబ్ వీడియోస్ చేసే అలవాటు ఉందనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా బహిర్గతం చేశారు. రౌడీలను కొట్టేసిన వీరయ్య "ఇలాంటి ఎంటర్‌టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్.. షేర్.. అండ్ సబ్‌స్క్రైబ్ చేయండి" అంటూ లైవ్‌లోనే వీడియో చేసేయడం చూపించారు. కాగా, ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.