శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (12:50 IST)

చిరంజీవికి షాకిచ్చిన కన్నడ హీరో : 'గాడ్ ఫాదర్' వసూళ్లపై 'కాంతార' ఎఫెక్ట్!

kantara
మెగాస్టార్ చిరంజీవి నటించన తాజా చిత్రం "గాడ్‌ ఫాదర్". ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ హిట్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇంతలోనే కన్నడ హీరో రిషబ్ షెట్టి నటించిన కన్నడ చిత్రం "కాంతార" చిత్రం తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇది కూడా ఇపుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 
 
గాడ్ ఫాదర్ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరింది. దగ్గరలో ఆ స్థాయికి తగిన సినిమాలేవీ లేకపోవడం వలన, మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా జోరు కొనసాగడం ఖాయమని అంతా భావించారు. 
 
సరిగ్గా ఈ సమయంలోనే కన్నడ నుంచి 'కాంతార' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో విడుదలై 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిన ఈ సినిమాను, గీతా ఆర్ట్స్ వారు ఈ నెల 15వ తేదీన ఇక్కడ విడుదల చేశారు. 
 
ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్‌కి పెద్దగా తెలియదు. అయినా కంటెంట్‌తో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా రూ.16 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 
 
ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. దాంతో 'గాడ్ ఫాదర్' వసూళ్లకు గండి పడిందనే అంటున్నారు.'గాడ్ ఫాదర్' రాజకీయాల నేపథ్యంలో డీసెంట్‌గా సాగే కథ. 'కాంతార' అడవి నేపథ్యంలో గిరిజనుల జీవితాల మధ్య సాగే కథ. అందువలన ఈ కథ మాస్ ఆడియన్స్‌కి వెంటనే కనెక్ట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.