1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (15:06 IST)

నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు..

godfather
మెగాస్టార్ చిరంజీవి తాజాగా షేర్ చేసిన 10 సెకన్ల నిడివి కలిగిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. "రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నా... నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు" అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ప్రస్తుతం ఆయన "గాడ్‌ఫాదర్" చిత్రంలో నటిస్తున్నారు. విజయదశమి కానుకగా వచ్చే నెల ఐదో తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ డైలాగ్ ఉంది. అంటే.. చిరంజీవిలో ఇంకా రాజకీయాలు అంటే ఆసక్తి చనిపోలేదా అనే సందేహం కలుగుతోంది. 
 
అయితే, మరికొందరు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. అది "గాడ్‌ఫాదర్" చిత్రంలోని డైలాగ్ అని అంటున్నారు. ఇంకొందరు మాత్రం నిజంగానే ఆయన రాజకీయాల్లోకి రావాలంటున్నారు. మరికొందరు.. చిరంజీవి రాజకీయాలకు పనికిరారనీ, ఆయనది స్థిరమైన మనస్తత్వం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.