గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 3 అక్టోబరు 2022 (22:29 IST)

వేడినీరు తాగితే ఏమవుతుంది?

warm water
ఈమధ్య కాలంలో వీలున్నప్పుడల్లా వేడినీరు తాగేయడం చాలామందికి అలవాటుగా మారింది. ఐతే తాగాల్సిన నీరు వేడినీరు కాదు.. గోరువెచ్చని నీరు. కానీ తేడా తెలియకుండా బాగా వేడిగా వున్న మంచినీళ్లు తాగితే అనారోగ్య సమస్యలకు గురవ్వవచ్చు.

 
ఎక్కువసేపు వేడినీరు తాగడం హానికరం. చాలా వేడి నీటిని తాగడం వల్ల పెదవులు, నోరు మండుతున్నట్లవుతాయి. నోటిలో పొక్కులు రావచ్చు. అన్నవాహిక, జీర్ణవ్యవస్థలోని సున్నితమైన పొరలు కూడా దెబ్బతింటాయి. నిరంతరం వేడి నీటిని తాగడం వల్ల అంతర్గత అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. ఏకాగ్రత స్థాయిలు ప్రభావితం కావచ్చు. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచవచ్చు.
 
శ్వాసకోశ ఇబ్బంది కలిగించవచ్చు. నీటి ఉష్ణోగ్రతను నిర్ణయించే ముందు మీ నిపుణుడిని సంప్రదించండి.