శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (10:02 IST)

సినీ నటి రత్నప్రభకు సతీవియోగం.. అనారోగ్యంతో భర్త కన్నుమూత

vidyasagar raju
సినీ నటుడు విద్యాసాగర్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 73 యేళ్లు. ఈయన సినీ నటి రత్నప్రభ భర్త. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన కొన్ని రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యారు. ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈయన గతంలో మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అహ నా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాసాగర్ రాజు తొలుత నాటకాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత  సినీ రంగంలోకి అడుగుపెట్టి అన్ని తరహా పాత్రలను పోషించారు. ఈ చదువులు మాకొద్దు అనే చిత్రంలో ఈయన ప్రధాన పాత్రను పోషించారు. 
 
ఈయన సినీ కెరీర్‌లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి విద్యాసాగర్ రాజు సినీ నటి రత్నప్రభ భర్తే. రత్నప్రభకు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే. ఈమె ఎక్కువగా జంధ్యాల చిత్రాల్లో నటించేవారు.