శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (10:28 IST)

అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయుద్ధ వీరుడు

mike tyson
మైక్ టైసన్.. మల్ల యుద్ధ వీరుడు. ఇటీవల "లైగర్" చిత్రంలో కనిపించారు. ఇపుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సయాటికా వ్యాధితో బాధపడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. వెన్నుకింది భాగంలో నొప్పి వస్తుందని, ఈ భరించలేనంతగా వస్తుందని అలాంటి సమయాల్లో కనీసం మాట్లాడలేనని టైసన్ వాపోతున్నారు. 
 
ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ కోర్టులో తిరుగులేన చాంపియన్‌గా జీవితాన్ని గడిపిన టైసన్.. ఇపుడు అనారోగ్యంతో బాధపడటం ప్రతి ఒక్కరినీ బాధకు గురిచేస్తుంది. ఇటీవల ఆయన మియామి ఎయిర్‌పోర్టులో చక్రాల కుర్చీలో కనపడటం ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనుచేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ వార్తపై మైక్ టైసన్ స్పందించారు. తాను సయాటికా సమస్యతో బాధపడుతున్నానని చెప్పారు. ఈ సమస్య కారణంగా వెన్ను కింది భాగం, పిరుదులు, కాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంటుందని, నొప్పి మరింత ఎక్కువైనపుడు కనీసం మాట్లాడలేనని చెప్పారు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నానని, పరిస్థితి కాస్త మెరుగ్గానే వుందని తెలిపారు.