ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (23:15 IST)

సమంత సీరియస్ హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతుందా? (video)

Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె స్థానం ఇంకెవరూ భర్తీ చేయలేనంత స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషీలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ శాకుంతలం నడుస్తోంది.

 
యశోద చిత్రం విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలావుంటే ఈమధ్య సమంత హెల్త్ వైజ్ సఫర్ అవుతుందని టాక్. ఈ కారణంగానే ఖుషీ షెడ్యూల్ జాప్యం అవుతుందట. 15 రోజుల వరకూ తను బయటకు రాలేనని కబురు పెట్టిందట. సమంత నుంచి వచ్చిన మెసేజ్ చూసి యూనిట్ ఒకింత షాక్ అయ్యిందట.

 
జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడే సమంత ఈ విషయాన్ని కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుందేమో. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తోందట.