ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (23:09 IST)

క్యాస్టింగ్ కౌచ్‌పై ఇషా కొప్పికర్‌ కామెంట్స్.. (Video)

Isha Koppikar
క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్‌ బ్యూటీ ఇచ్చిన స్టేట్‌మెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. బాలీవుడ్‌కు చెందిన ఇషా కొప్పికర్‌ తన తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనను పంచుకుంది. ఒక సమయంలో వయసులో తనకంటే చాలా పెద్దవాడైన ఓ ప్రముఖ నిర్మాత, నటుడు తనను ఒంటరిగా కలవాలని ఇబ్బంది పెట్టినట్లు చెప్పుకొచ్చింది. 
 
అయితే తాను సదరు నిర్మాత దగ్గరికి తన వ్యక్తిగత సిబ్బందితో వెళ్లానని.. దాంతో తనను కలవడానికి నిరాకకరించాడని తెలిపింది. అంతటితో ఆగని ఆ నిర్మాత తాను చెప్పినట్లు ఒంటరిగా కలవకపోవడంతో వెంటనే ఆ సినిమా నుంచి తొలగించాడని చెప్పుకొచ్చింది. 
 
ఈ సంఘటన మనసును ముక్కలు చేసిందన్న ఇషా.. ఇండస్ట్రీలో అందంగా ఉండడం ఎంత ముఖ్యమో, హీరోల జాబితాలో చేరడం అంతే ముఖ్యమని ఆ క్షణంలో అర్థమైనట్లు తెలిపింది.

ఇక జీవితంలో వృత్తికంటే నిజాయితీగా బతకడమే గొప్పగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈషా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.